Akhilesh Yadav | ఢిల్లీలో ఉద్రిక్తత.. బారికేడ్లు ఎక్కి దూకిన ఎంపీ అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్
Akhilesh Yadav | బీహార్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను (SIR) వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు.
Akhilesh Yadav | బీహార్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను (SIR) వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపీలు మార్చ్ (MPs March) చేపట్టారు. ఎంపీలు చేపట్టిన ఈ ర్యాలీ ఉద్రిక్తతంగా మారింది.
ఇండియా కూటమి ఎంపీల ర్యాలీతో అప్రమత్తమైన పోలీసులు సంసద్ మార్గ్‌లో భారీగా మోహరించారు. ఈసీ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్తున్న ఎంపీలను బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. అయితే, ప్రతిపక్ష ఎంపీలు బారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాజ్‌వాది పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) బారికేడ్లు ఎక్కి దూకారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఎంపీల నిరసనతో రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
#WATCH | Delhi: Samajwadi Party chief Akhilesh Yadav jumped over a police barricade as Delhi Police stopped INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound… pic.twitter.com/ddHMdwWPqs
— ANI (@ANI) August 11, 2025
Also Read..
Air India | రతన్ టాటా ఉండి ఉంటే.. విమాన ప్రమాద బాధితులకు పరిహారం జాప్యంపై యూఎస్ లాయర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

