MPs March | బీహార్‌లో చేపట్టిన ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ (SIR)పై విపక్ష ఇండియా కూటమి ఎంపీలు తమ ఆందోళనలను ఉద్ధృతం చేశారు. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించారంటూ విపక్ష కూటమి సభ్యులు (INDIA bloc MPs) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు నిరసగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇవాళ పార్లమెంట్ (Parliament) నుంచి ఈసీ (Election Commission) కార్యాలయం వరకూ ఎంపీలు మార్చ్ (MPs March) చేపట్టారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలు చేశారు. విపక్ష ఎంపీల ర్యాలీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంసద్ మార్గ్‌లో భారీగా పోలీసులు మోహరించి ఎంపీల ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. పలువురు ఎంపీలు బారికేడ్లను ఎక్కి అవతలి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాస్త గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు తలెల్తాయి. ఎంపీల మార్చ్‌తో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
#WATCH | Delhi Police stops INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of “voter fraud” during the 2024 Lok Sabha elections. pic.twitter.com/4KcXEALWxY
— ANI (@ANI) August 11, 2025
#WATCH | Delhi Police stops INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of “voter fraud” during the 2024 Lok Sabha elections. pic.twitter.com/B3yuiL0fJz
— ANI (@ANI) August 11, 2025
#WATCH | Delhi: INDIA bloc leaders march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of “voter fraud” during the 2024 Lok Sabha elections. pic.twitter.com/sl7XVHTlv3
— ANI (@ANI) August 11, 2025
Also Read..
Air India | రతన్ టాటా ఉండి ఉంటే.. విమాన ప్రమాద బాధితులకు పరిహారం జాప్యంపై యూఎస్ లాయర్
Jagdeep Dhankhar | జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడున్నారు..? : అమిత్‌షాకు సంజయ్‌రౌత్ లేఖ