Air India | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా (Air India) విమానం ప్రమాదానికి (Plane Crash) గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ ఎయిర్ ఇండియా సంస్థ రూ.కోటి పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రమాదం జరిగి రెండు నెలలైనా ఇప్పటికీ పరిహారం అందలేదు (compensation delays). దీనిపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో రతన్ టాటా (Ratan Tata)ను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన బతికి ఉండి ఉంటే ఇలా పరిహారం అందించడంలో జాప్యం జరిగేది కాదని చెప్పుకుంటున్నారు.
తాజాగా ప్రమాదంలో మరణించిన 65 బాధిత కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూఎస్ న్యాయవాది (US Lawyer) మైక్ ఆండ్రూస్ (Mike Andrews) కూడా ఎయిర్ ఇండియా సంస్థపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata)ను గుర్తు చేసుకున్నారు. ఆయన ఉండి ఉంటే పరిహారం విషయంలో ఇంత ఆలస్యం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. ‘అమెరికాలో కూడా రతన్ టాటా గురించి తెలుసు. ఆయన పనితీరు, ఉద్యోగుల పట్ల ఆయన తీసుకునే శ్రద్ధ గురించి బాగా తెలుసు. తన ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. ఈ రోజు ఆయన ఉండి ఉంటే.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు, విద్యార్థుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేసేవారు. పరిహారం చెల్లింపులో ఇంత ఆలస్యం జరిగిఉండేది కాదు’ అని వ్యాఖ్యానించారు.
విమాన ప్రమాద మృతుడి తల్లికి సంబంధించిన పరిస్థితిని ఈ సందర్భంగా ఆండ్రూస్ ప్రస్తావించారు. ‘మేము ఓ కుటుంబాన్ని కలిశాము. విమాన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి తల్లి మంచానికే పరిమితమైంది. ఆమెకు ఆర్థిక సాయంగా ఉన్న ఏకైక కుమారుడు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకూ ఆర్థిక సాయం అందలేదు. ఆమెకు ఇప్పుడు ఎవరు సాయం చేస్తారు..?’ అని పేర్కొన్నారు.
జూన్ 12వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఎయిర్ ఇండియాకు చెందిన విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరింది. ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానం ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 242 మంది ఉన్నారు. ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒకే ఒక్కరు ప్రాణాలతో మిగిలారు. ఇక విమానం మెడికల్ కాలేజీకి చెందిన హాస్టల్‌పై పడటంతో అందులోని కొందరు మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా మరణించారు.
మరణించిన ప్రయాణికుల్లో 181 మంది భారతీయులు కాగా, 52 మంది బ్రిటన్ వాసులు. ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియాని నిర్వహిస్తున్న టాటా గ్రూప్ సంస్థ బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ప్రకటించింది. ఆ తర్వాత మరో రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్టు పేర్కొంది. బాధిత కుటుంబాల తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అదనపు పరిహారం ప్రకటించినట్టు వెల్లడించింది. అయితే, ప్రమాదం జరిగి రెండు నెలలైనా ఇప్పటికీ పరిహారం అందకపోవడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Jagdeep Dhankhar | జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడున్నారు..? : అమిత్‌షాకు సంజయ్‌రౌత్ లేఖ
Elephant | టూరిస్ట్‌పై దాడి చేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో
KC Venugopal | ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. కేసీ వేణుగోపాల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం