లక్నో: ప్రభుత్వ స్కూల్లోని క్లాస్ రూమ్‌లో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. (School Roof Falls) సిమెంట్ శిథిలాలు పడటంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఆ జిల్లాలోని గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఐదో తరగతి గదిలో పైకప్పు స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. క్లాస్ జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది. దీంతో ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ సంఘటనతో స్కూల్ విద్యార్థులు భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆ స్కూల్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు కూడా ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. స్లాబ్ పెచ్చులు ఊడిపడిన క్లాస్‌రూమ్‌ను పరిశీలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు శుక్రవారం రాజస్థాన్‌లోని ఝలావర్‌లో ప్రభుత్వ స్కూల్ పైకప్పు కూలడంతో ఏడుగురు విద్యార్థులు మరణించారు. ఈ సంఘటనలో 30 మందికి పైగా పిల్లలు గాయపడ్డారు. వీరిలో 11 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆరుగురు పిల్లల మృతదేహాలకు శనివారం కలిసికట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు.
A day after a government school collapsed in Jhalawar district of Rajasthan, two students were injured after plaster came off the roof of a government school in Hapur district of Uttar Pradesh. pic.twitter.com/L2JJjESk48
— Piyush Rai (@Benarasiyaa) July 26, 2025
Also Read:
child bites cobra snake to death | చేతికి చుట్టుకున్న నాగుపాము.. కొరికి చంపిన ఏడాది బాలుడు
Wife Poisons Husband Twice | వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్తకు రెండుసార్లు విషమిచ్చి చంపిన భార్య