Jaishankar | కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఆ దేశంలో ల్యాండ్ అయ్యారు. తన పర్యటనలో రెండో రోజైన శనివారం ఆ దేశ అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu)తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలపై ఇరువురూ చర్చించుకున్నట్లు తెలిసింది. కాగా, చివరి సారిగా 2023 జనవరిలో జైశంకర్ మాల్దీవుల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముయిజ్జు ఈ ఏడాది జూన్‌లో భారత పర్యటనకు వచ్చిన సమయంలో ఇద్దరూ భేటీ అయ్యారు.
తాజా పర్యటనలో పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలూ చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ఈ భేటీకి సంబంధించిన ఫొటోను జై శంకర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ముయిజ్జుని కలవడం విశేషమన్నారు. మోదీ తరఫున శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. తమ ప్రజలు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం భారత్ – మాల్దీవుల సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయని తెలిపారు.
Privileged to call on President Dr Mohamed Muizzu. Conveyed greetings of PM @NarendraModi.
Committed to deepen India-Maldives ties for the benefit of our people and the region.@MMuizzu pic.twitter.com/FSP1kqefbx
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 10, 2024
Also Read..
Cisco Layoffs | AI ఎఫెక్ట్.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఆరు నెలల్లో రెండో సారి..!
PM Modi | కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. వీడియో