Mihir Shah | బీఎండబ్ల్యూ కారుతో ఢీ కొట్టి ఓ మహిళ మృతికి కారణమైన హిట్ అండ్ రన్ (Mumbai hit and run) కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, శివసేన నేత (శిండే వర్షం) రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ షాను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. మద్యం మత్తులో మిహిర్ షా (Mihir Shah) కారు నడిపినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే, తాజాగా ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.
ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడి రక్తం, మూత్ర పరీక్షలు నెగెటివ్ వచ్చాయి. ఆ నమూనాల్లో మద్యం ఆనవాళ్లు లేవని తేలింది (blood And urine tests show no alcohol). మిహిర్ షా రక్తం, మూత్ర నమూనాల్లో మద్యం జాడలు కనిపించలేదని పోలీసులు తాజాగా తెలిపారు. కాగా, ఘటన జరిగిన 58 గంటల తర్వాత మిహిర్ షాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రమాదానికి, నమూనాల సేకరణకు మధ్య ఎక్కువ సమయం ఉండటం వల్ల పరీక్ష ఫలితాలు ప్రతికూలంగా వచ్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, జులై 7న ముంబైలోని వర్లీ ప్రాంతంలో తెల్లవారుజామున మిహిర్ ( Mihir Shah) మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో స్కూటీపై వెళ్తున్న దంపతులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. అలాగే వేగంగా వెళ్తున్న కారు కావేరి నక్వా (45) పై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త మాత్రం గాయాలతో బయటపడ్డాడు. మాదం తర్వాత మిహిర్ ఫోన్లో తన తండ్రికి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కొడుకుని అక్కడ నుంచి పంపించి వేశాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు రాజేష్, డ్రైవర్ బిదావత్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాజేష్ షా బెయిల్పై బయటకు వచ్చారు.
ఘటన అనంతరం పరారైన మిహిర్ షాను పోలీసులు ఈ నెల 9న అదుపులోకి తీసుకున్నారు. వేషం మార్చి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుడిని ముంబైలోని విరారా ప్రాంతంలో గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో మిహిర్ తల్లి, ఇద్దరు తోబుట్టువులతోపాటు మరో 10 మందిని అధికారులు విచారించారు.
Also Read..
Abdur Rouf Talukder: బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ రౌఫ్ రాజీనామా