Susan Wojcicki | యూట్యూబ్ మాజీ సీఈవో (YouTube Ex CEO) సుసాన్ వోజ్కికీ (Susan Wojcicki) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 56 ఏళ్లు. సుసాన్ మరణవార్తను ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఈ మేరకు భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ (battle with cancer)తో పోరాడుతున్నట్లు చెప్పారు. ఇవాళ కుటుంబాన్ని వదిలేసి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యారు.
యూఎస్‌కు చెందిన సుసాన్ 2014 నుండి 2023 వరకు యూట్యూబ్ సీఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆమె గూగుల్‌లో పనిచేశారు. ఈ నేపథ్యంలో సుసాన్ మృతిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) తీవ్ర దిగ్భ్రాం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలు క్యాన్సర్‌తో పోరాడిన తన స్నేహితురాలు మరణించడం నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. తను ఓ అద్భుతమైన వ్యక్తి అని, ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమన్నారు. కాగా, గూగుల్‌లో సుసాన్ కీలక వ్యక్తిగా వ్యవహరించారు. ఇంటర్నెట్ను రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించారు.
Also Read..
PM Modi | వయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
Terrorists | ఉగ్రవాదుల ఊహాచిత్రాలను రిలీజ్ చేసిన కథువా పోలీసులు.. సమాచారం ఇచ్చిన వారికి రివార్డ్
Tihar jail official | సర్వీస్ తుపాకీతో డ్యాన్స్.. తీహార్ జైలు అధికారిపై వేటు