Tihar jail official | తీహార్ జైలు అధికారి (Tihar jail official) ఒకరు తుపాకీ చేతపట్టుకొని డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియోపై స్పందించిన జైలు ఉన్నతాధికారులు అతడిపై వేటు వేశారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దీపక్ శర్మ అనే వ్యక్తి తీహార్ జైల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. తీహార్ జైలు పరిధిలోని మాండోలి కారాగారంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, ఇటీవలే ఓ కార్యక్రమానికి వెళ్లిన దీపక్.. అక్కడ డ్యాన్స్ చేశాడు. మరో ముగ్గురితో కలిసి ‘ఖల్నాయక్ హూన్ మైన్’ అనే సాగే బాలీవుడ్ పాటకు కాలు కదిపాడు. తన సర్వీస్ రివాల్వర్‌ను చేత్తో పట్టుకుని చుట్టూ ఉన్న వారిపై గుడి పెడుతున్నట్లుగా ఫోజులిస్తూ డ్యాన్స్ చేశాడు (dancing with pistol).
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అదికాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. వీడియోపై స్పందించిన జైలు అధికారులు దీపక్‌పై చర్యలు చేపట్టారు. దీపక్ శర్మను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
तिहाड़ जेल प्रशासन ने वर्तमान में मंडोली सेंट्रल जेल नंबर 15 में तैनात सहायक अधीक्षक दीपक शर्मा को निलंबित कर दिया है। एक वीडियो वायरल हुआ था जिसमें वह एक जन्मदिन की पार्टी में पिस्तौल लहरा रहे थे।#TiharJail #DeepakSharma pic.twitter.com/ZiPY5sh8kA
— Veer Arjun (@VeerArjunDainik) August 9, 2024
Also Read..
Manish Sisodia | కేజ్రీవాల్ కూడా త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారు : మనీశ్ సిసోడియా
Israeli | గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులు.. 100 మంది మృతి
Hockey Team | భారత్ చేరుకున్న పురుషుల హాకీ టీమ్.. ఢిల్లీలో ఘన స్వాగతం