Hockey Team | పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) కాంస్య పతకం (bronze medal) కొల్లగొట్టిన భారత పురుషుల హకీ జట్టు సగర్వంగా స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జట్టు సభ్యులు ల్యాండ్ అయ్యారు. వారికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. టీమ్‌లోని ప్రతి ఆటగాడికీ పూల దండ వేసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంస్యంతో భారత గడ్డపై కాలుమోపిన హాకీ టీమ్.. డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
#WATCH | Indian Men’s Hockey Team players celebrate as they arrive at Delhi airport after winning a bronze medal at the #ParisOlympics2024 pic.twitter.com/UN5edgVqIJ
— ANI (@ANI) August 10, 2024
విశ్వ క్రీడల్లో భారత పురుషుల హకీ జట్టు అద్వితీయ విజయంతో కాంస్యం (Bromze Medal) కొల్లగొట్టింది. పసిడి వేటలో తడబడిన టీమిండియా కంచు పోరులో మాత్రం జూలు విదిల్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) డబుల్ గోల్‌తో స్పెయిన్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి నాలుగో మెడల్ అందించడంతో పాటు 52 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కంచు మోత మోగించింది.
#WATCH | Indian Men’s Hockey Team players show their medals as they arrive at Delhi airport after winning bronze at the #ParisOlympics2024 pic.twitter.com/GUvrDkwaRx
— ANI (@ANI) August 10, 2024
ఒకానొక సమయంలో ప్రపంచ హాకీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ ఒలింపిక్స్‌లో అదరగొట్టింది. ధ్యాన్ చంద్(Dhyan Chand) హయాంలో జైత్రయాత్ర కొనసాగిస్తూ పసిడి పతకాలను కొల్లగొట్టింది. 1968లో మెక్సికోలో జరిగిన ఒలింపిక్స్‌లో, ఆ తర్వాత 1972లో మ్యూనిచ్ (జర్మనీ) ఆతిథ్యమిచ్చిన విశ్వ క్రీడల్లో భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ 52 ఏండ్లకు వరుసగా రెండు కాంస్యాలతో భారత్ చరిత్ర సృష్టించింది. మొత్తంగా విశ్వ క్రీడల హాకీలో భారత జట్టు పతకాల సంఖ్యను 13కు చేర్చింది. దాంతో, యావత్ దేశం హాకీ యోధుల చిరస్మరణీయ విజయాన్నిసంబురంగా కీర్తిస్తోంది.
#WATCH | Indian Men’s Hockey Team players receive a grand welcome as they arrive at Delhi airport after winning a bronze medal at the #ParisOlympics2024 pic.twitter.com/NxGLRDtXRi
— ANI (@ANI) August 10, 2024
Also Read..
Manish Sisodia | 17 నెలల తర్వాత ఇంట్లో టీ తాగుతున్నా : మనీష్ సిసోడియా
Plane Crash | బ్రెజిల్లో కుప్పకూలిన విమానం.. వీడియో
PM Modi | నేడు వయనాడ్‌కు ప్రధాని మోదీ.. ఇకనైనా జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రాహుల్