బ్రెసిలియా: బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది దుర్మరణం చెందారు. వోపాస్ లిన్హాస్ ఏరియాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పరన రాష్ట్రంలోని కాస్కవెల్ నుంచి సావో పౌలోలోని గువారుల్హోస్ వెళ్తున్నది. ఈ క్రమంలో విన్హెడో పట్టణంలో విమానం కుప్పకూలిపోయింది. విమానంలో 58 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నారని.. అంతా మరణించారని అధికారులు వెల్లడించారు. విమానం ఓ ఇంటిపై కూలిపోయిందని, అయితే నివాసితులు క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ప్రమాద ఘటనపై అధ్యక్షుడు లుయూజ్ లులా డిసిల్వా విచారం వ్యక్తం చేశారు.
కాగా, విమానం కూలిపోతుండగా స్థానికులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. విమానం గాలిలో గింగిరాలు తిరుగుతూ చెట్లలోకి పడిపోవడం, పెద్దయెత్తున నల్లటి పొగ ఆవరించడం కనిపించింది.
— Oswaldo Romano (@oromanobr) August 9, 2024
Gente!! Que horror 😨 pic.twitter.com/YgpSyTho6Y
— Caio (@caioam) August 9, 2024
✈️💥🇧🇷 🔥 #BREAKING: A plane has crashed in São Paulo, Brazil, claiming the lives of 70 people#JuegosOlímpicos pic.twitter.com/ilzhxFfRYZ
— UN©️ENSORED 𝕏Men (@GutNews247) August 9, 2024