న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకు పోయిన వయనాడులో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు. వరణుడు సృష్టించిన విలయాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరావాస చర్యలను సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి వయనాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. అందులో భాగంగా చూరల్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన సందర్శించనున్నారని తెలుస్తున్న. అనంతరం జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలపై ఉన్నతాధికారులుతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు.
కాగా, ప్రధాని పర్యటనపై లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పీఎం మోదీ పర్యటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది సరైన నిర్ణయమన్నారు. ఇప్పటికైన వయనాడ్ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటిచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.