బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ 300 టోర్నీలో హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. టోర్నీ రెండో రోజు భారత్ భారీ ఆశలు పెట్టుకున్న స్టార్ షట్లర్లంతా తొలిరౌండ్‌కే ఇంటిబాట పట్టినా తరుణ్ మాత్రం అద్భుతమైన ఆటతీరుతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో 43వ ర్యాంకు తరుణ్.. 16-21, 21-16, 7-2తో ఐదో సీడ్ జపాన్ ప్రత్యర్థి కెంటా నిషిమొటొపై గెలిచాడు.
ఇరువురు తలా ఒక గెలవడంతో నిర్ణయాత్మక మూడో గేమ్ మధ్యలో కెంటాకు భుజం గాయం కారణంగా అతడు ఆట నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అప్పటికే 7-2తో ఆధిక్యంలో ఉన్న తరుణ్.. తదుపరి రౌండ్‌కు ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 11-21, 15-21తో థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగో సీడ్ చొచువాంగ్ చేతిలో ఓడింది.