PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కన్నూరు విమానాశ్రయం నుంచి వయనాడ్ (Wayanad) చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకుపోయిన ప్రాంతాల్లో మోదీ పర్యటిస్తున్నారు. కొండచరియలు వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే (aerial survey) చేపట్టారు. హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ సాగుతున్న సహాయక చర్యలు, బాధితుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని వెంట కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, స్థానిక అధికారులు ఉన్నారు.
#WATCH | Kerala: Prime Minister Narendra Modi conducts an aerial survey of the landslide-affected area in Wayanad
CM Pinarayi Vijayan is accompanying him
(Source: DD News) pic.twitter.com/RFfYpmK7MJ
— ANI (@ANI) August 10, 2024
కాగా, వయనాడ్ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పీఎం మోదీ పర్యటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది సరైన నిర్ణయమన్నారు. ఇప్పటికైన వయనాడ్ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Also Read..
Terrorists | ఉగ్రవాదుల ఊహాచిత్రాలను రిలీజ్ చేసిన కథువా పోలీసులు.. సమాచారం ఇచ్చిన వారికి రివార్డ్
Tihar jail official | సర్వీస్ తుపాకీతో డ్యాన్స్.. తీహార్ జైలు అధికారిపై వేటు
Manish Sisodia | కేజ్రీవాల్ కూడా త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారు : మనీశ్ సిసోడియా