Cisco Layoffs | AI ఎఫెక్ట్.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఆరు నెలల్లో రెండో సారి..!
Cisco Layoffs | ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ సిస్కో (Cisco Layoffs) భారీగా కొలువుల కోతకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
Cisco Layoffs | ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. మాంద్యం భయాల కారణంగా ఇప్పటి వరకూ వందలాది సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. అయితే, ఇప్పుడు ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. రెండు రోజుల క్రితం డెల్ టెక్నాలజీస్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని ఏకంగా 12500 మందిని డెల్ విధుల నుంచి తొలగించింది.
ఇప్పుడు మరో సంస్థ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ సిస్కో (Cisco Layoffs) భారీగా కొలువుల కోతకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ వ్యాపార పునర్వ్యవస్థీకరణకు పూనుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో దాదాపు 4,000 మందికి లేఆఫ్‌లు ప్రకటించిన ఈ సంస్థ తాజాగా అదే సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైనట్లు (second round of layoffs) తెలిసింది. ఆరు నెలలు గడవకముందే మళ్లీ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
వ్యాపారంలో డిమాండ్ తగ్గడం, సరఫరా చైన్‌లో సమస్యల కారణంగానే కంపెనీ ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది. మరోవైపు 2025 నాటికి ఏఐ ఉత్పత్తుల ఆర్డర్లో బిలియన్కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు రాయిటర్స్ నివేదించింది. కాగా, సిస్కోలో ప్రపంచవ్యాప్తంగా 84,900 మంది పనిచేస్తున్నట్లు అంచనా. తాజా కొలువుల కోతతో ఈ సంఖ్య భారీగా తగ్గనుంది.
Also Read..
Zoetis Inc | హైదరాబాద్‌లో కేపబులిటీ సెంటర్‌ను విస్తరించనున్న జొయిటిస్.. వందలాది మందికి ఉద్యోగాలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

