PM Modi | ఇండిగో సంక్షోభం (IndiGo Crisis)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి స్పందించారు. ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనలు పౌరులను ఇబ్బందులకు గురిచేయకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇవాళ ఉదయం బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండిగో సంక్షోభం గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజుజు (Kiren Rijiju) తెలిపారు.
ఇండిగో సంక్షోభంపై ప్రధాని స్పందనకు సంబంధించిన వివరాలను కిరెన్ రిజుజు మీడియాతో పంచుకున్నారు. ‘దేశంలోని ఏ పౌరుడూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా చూసుకోవడం మన బాద్యత. నియమాలు, నిబంధనలు మంచివే.. కానీ వాటిని వ్యవస్థను మెరుగుపరచడానికి మాత్రమే ఉపయోగించాలి (Rules To Improve System). ప్రజలను వేధించడానికి కాదు (Not To Harass People). సామాన్య పౌరుల్ని ఇబ్బందిపెట్టే చట్టం, నిబంధన ఉండకూడదు’ అని ప్రధాని పేర్కొన్నట్లు కిరెన్ రిజుజు తెలిపారు.
Also Read..
IndiGo | తొమ్మిదో రోజుకు చేరిన ఇండిగో సంక్షోభం.. నేడు కూడా వందలాది విమానాలు రద్దు
ఒడవని ఇండిగో సంక్షోభం.. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు తప్పని అవస్థలు, పడిగాపులు
IndiGo | సంక్షోభంపై కేంద్రానికి లేఖ.. ఈ 5 కారణాలతోనే ‘సర్వీస్‌ల రద్దు’ అంటున్న ఇండిగో..!