IndiGo | తొమ్మిదో రోజుకు చేరిన ఇండిగో సంక్షోభం.. నేడు కూడా వందలాది విమానాలు రద్దు
IndiGo | ఇండిగో నిర్వహణ సంక్షోభం తొమ్మిదో రోజుకు చేరింది. మంగళవారం కూడా వందలాది విమానాలు రద్దయ్యాయి.
IndiGo | ఇండిగో నిర్వహణ సంక్షోభం తొమ్మిదో రోజుకు చేరింది. మంగళవారం కూడా వందలాది విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో దాదాపు 300 విమాన సర్వీసులు క్యాన్సెల్ అయ్యాయి. ఫలితంగా వేలాదిమంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Bengaluru, Karnataka | IndiGo flights cancellations for today: Arrivals- 58, Departures – 63. Next update to be shared after 6 pm: Kempegowda International Airport Limited (KIAL)
— ANI (@ANI) December 9, 2025
నేడు బెంగళూరు (Bengaluru)విమానాశ్రయంలో అత్యధికంగా 121 విమానాలు రద్దయ్యాయి. అందులో 58 అరైవల్స్ కాగా, 63 డిపార్చర్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో 58 (అరైవల్స్ 14, డిపార్చర్స్ 44), చెన్నైలో 41 (18 డిపార్చర్స్, 23 అరైవల్స్), ముంబైలో 31 విమానాలు (14 అరైవల్స్, 17 డిపార్చర్స్), అహ్మదాబాద్‌లో తొమ్మిది అరైవల్స్, ఏడు డిపార్చర్స్ మొత్తం 16 విమానాలు రద్దయ్యాయి. కేరళలో నాలుగు (అరైవల్ ఒకటి, డిపార్చర్స్ మూడు) రద్దయ్యాయి.
Tamil Nadu | IndiGo Airlines’ 18 departures and 23 arrivals have been cancelled at the Chennai Airport.
Source: Chennai Airport pic.twitter.com/Iq7hKwAjEZ
— ANI (@ANI) December 9, 2025
రూ.827కోట్ల రిఫండ్ల చెల్లింపు
డిసెంబర్ 1 నుంచి 7 మధ్యకాలంలో జరిగిన 5.86 లక్షల పీఎన్ఆర్‌ల రద్దుకు సంబంధించి రూ.569.65 కోట్ల రిఫండ్లు చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు 9.55 లక్షల పీఎన్ఆర్లు రద్దు కాగా వాటికి రూ.827 కోట్ల రిఫండ్లు చెల్లించినట్లు ప్రభుత్వం వివరించింది. ఇప్పటికే ప్రయాణికులకు చెందిన దాదాపు 4,500 బ్యాగులను ఇండిగో అంద చేయగా మిగిలిన 4,500 బ్యాగులను వచ్చే 36 గంటల్లో చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Hyderabad, Telangana | IndiGo flight cancellations for today: Arrivals – 14, Departures – 44.
Source: RGI Airport Hyderabad
— ANI (@ANI) December 9, 2025
Ahmedabad, Gujarat | IndiGo flight cancellations today- 16 (09 Arrivals | 07 Departures). Total flights operated till 0800 hrs are 23 (Arrivals: 07, Departures: 16). No issues in the terminal & Airside. Passengers facilitation is being taken care.
Source: Ahmedabad Airport
— ANI (@ANI) December 9, 2025
Mumbai | IndiGo flight cancellations for today- 14 arrivals and 17 departures: Chhatrapati Shivaji Maharaj International Airport
— ANI (@ANI) December 9, 2025
Also Read..
ఒడవని ఇండిగో సంక్షోభం.. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు తప్పని అవస్థలు, పడిగాపులు
Starlink | భారత్‌లో స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించలేదు : మస్క్ సంస్థ
Actor Vijay | పుదుచ్చేరిలో విజయ్ బహిరంగ సభ.. ర్యాలీలోకి తుపాకీతో చొరబాటుకు వ్యక్తి యత్నం..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

