Actor Vijay | కరూర్ తొక్కిలాట తర్వాత ప్రముఖ నటుడు, టీవీకే (TVK) చీఫ్ విజయ్ (Actor Vijay).. నేడు పుదుచ్చేరి (Puducherry)లో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉప్పాలం (Uppalam) లోని ఎక్స్పో గ్రౌండ్ (Expo ground) వేదికగా సభ జరుగుతోంది. కరూర్ ఘటన నేపథ్యంలో పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి గన్ (Man carrying gun)తో సభా వేదికలోకి ప్రవేశిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. అయితే, సదరు వ్యక్తి శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా అధికారులు గుర్తించారు.
కాగా, పుదుచ్చేరి పోలీసులు (Puducherry police) విజయ్ సభకు అనుమతి ఇచ్చినా.. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. పోలీసులు విధించిన షరతుల మేరకు విజయ్ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచారం రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదు. చిన్నారులు, గర్భిణి మహిళలు, వృద్ధులను ఈ సభకు అనుమతించకూడదు. ఈ నిబంధన మేరకు పార్టీ 5 వేల మందికి మాత్రమే ఎంట్రీ పాసులు ఇవ్వాలి. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే సభకు రావాలి. ఈ షరతుల నేపథ్యంలో పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాలకు చెందిన వారు సభకు రావద్దని టీవీకే కోరింది.
సభా నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయ్ ప్రచార రథం సోమవారం రాత్రే పుదుచ్చేరికి చేరుకుంది. విజయ్ మంగళవారం ఉదయం 11 గంటలకు కారులో సభాస్థలికి చేరుకుంటారు. సభకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అనుమతి ఉంది. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగం మొదలుపెట్టనున్నారు.
Also Read..
Starlink | భారత్‌లో స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించలేదు : మస్క్ సంస్థ
Donald Trump: బియ్యం దిగుమతులపై భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
ఉషను భారత్‌కు పంపించివేయండి.. జేడీ వాన్స్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్