Starlink | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్టార్‌లింక్ (Starlink) సంస్థ శాటిలైట్ వ్యవస్థ (Starlink satellite services) ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత్‌లో రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సేవలను వచ్చే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలను సంస్థ ప్రకటించినట్లు నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్‌లింక్ ఇంటర్నెట్ రెసిడెన్షియల్ ప్లాన్ ధర నెలకు రూ.8,600, శాటిలైట్ డిష్ కిట్ ధర రూ.34,000 అని స్టార్‌లింక్ వెబ్సైట్లో కనిపించింది.
అయితే, దీనిపై సంస్థ తాజాగా స్పందించింది. స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలను తాము ఇంకా ప్రకటించలేదని వెల్లడించింది. వెబ్సైట్లో ధరలు చూపడాన్ని కాన్ఫిగరేషన్ గ్లిచ్ (configuration glitch)గా పేర్కొంది. అవి కేవలం డమ్మీ డేటా మాత్రమేనని స్పష్టం చేసింది. అసలు ధరలు ఇంకా ఫిక్స్ చేయలేదని వెల్లడించింది. ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాకే సేవలు ప్రారంభమవుతాయని క్లారిటీ ఇచ్చింది.
స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ VP లారెన్ డ్రేయర్ (Lauren Dreyer) ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా స్పష్టతనిచ్చారు. స్టార్‌లింక్ సేవలు భారత్‌లో ఇంకా ప్రారంభించలేదని, కంపెనీ కస్టమర్ ఆర్డర్లను అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. ‘స్టార్‌లింక్ ఇండియా వెబ్సైట్ లైవ్‌లో లేదు. కస్టమర్లకు సర్వీస్ ధరలను ఇంకా ప్రకటించలేదు. కాన్ఫిగరేషన్ లోపం కారణంగా వెబ్సైట్లో ధరలు కనిపించాయి. అవి కేవలం డమ్మీ డేటా మాత్రమే’ అని పేర్కొన్నారు.
Also Read..
స్టార్‌లింక్ ఇంటర్నెట్ ప్లాన్ నెలకు 8,600.. శాటిలైట్ డిష్ కిట్ ధర 34,000
Donald Trump: బియ్యం దిగుమతులపై భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
ఉషను భారత్‌కు పంపించివేయండి.. జేడీ వాన్స్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్