Arvind Kejriwal : బీజేపీ సర్కారు (BJP govt) అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఢిల్లీని నాశనం చేసిందని ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విమర్శించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఢిల్లీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు అతిషిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ పోస్టు పెట్టారు.
కూల్చివేతలకు వ్యతిరేకంగా కల్కాజీలోని భూమిహిన్ క్యాంపులో జరుగుతున్న ఆందోళనల్లో ఇవాళ అతిషి పాల్గొన్నారు. దాంతో ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో బీజేపీ ఢిల్లీని సర్వనాశనం చేసిందని విమర్శించారు.