Meghalaya murder | నా కొడుకు అమాయకుడు.. తప్పుడు కేసులో ఇరికించారు : రాజ్ కుశ్వాహ తల్లి
Meghalaya murder | రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో అరెస్టయిన రాజ్ కుశ్వాహ (Raj Kushwaha) అమాయకుడని అతడి తల్లి చెబుతోంది. తన కొడుకుది కేవలం 20 ఏళ్ల వయసని, వాడు హత్యలు చేసే రకం కాదని అంటోంది.
Meghalaya murder : రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో అరెస్టయిన రాజ్ కుశ్వాహ (Raj Kushwaha) అమాయకుడని అతడి తల్లి చెబుతోంది. తన కొడుకుది కేవలం 20 ఏళ్ల వయసని, వాడు హత్యలు చేసే రకం కాదని అంటోంది. తమకు సర్వం తమ కొడుకేనని, తన కొడుకును తప్పుడు కేసులో ఇరికించారని ఆమె ఆరోపిస్తోంది. కేసులో అసలు నిందితులను పట్టుకుని తన కొడుకును విడిచిపెట్టాలని అభ్యర్థిస్తోంది.
‘నా కొడుకు ఇలాంటి చెడ్డ పనులు చేయడు. వాడి వయసు కేవలం 20 ఏళ్లు. నా సర్వస్వం నా కొడుకే. వాడు సోనమ్ సోదరుడి కంపెనీలో పని చేశాడు. హత్యతో వాడికి సంబంధం లేదు. వాడిని తప్పుడు కేసులో ఇరికించారు. నా కొడుకు అమాయకుడు. వాడి అమాయకత్వాన్ని రుజువు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా’ అని రాజ్ కుశ్వాహ తల్లి రోదించారు.
అదేవిధంగా రాజ్కుశ్వాహ సోదరి కూడా తన సోదరుడు అమయాకుడని చెబుతోంది. తనకు విక్కీ, రాజ్ ఇద్దరు సోదరులని, వాళ్లు హత్యలు చేసే మనుషులు కాదని అంటోంది. హత్య జరిగిన రోజు తన సోదరుడు ఎక్కడికీ వెళ్లలేదని, కావాలంటే అతడు పనిచేసే ఆఫీసులో అడగాలని కోరుతోంది. నా సోదరుడికి ఈ హత్యతో సంబంధం లేదని, అతడిని విడిచిపెట్టాలని వేడుకుంది.
కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మే 23 నుంచి ఆ జంట ఆచూకీ లేకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత సోనమ్ కోసం పోలీసులు వెతుకుతుండగా సోమవారం తెల్లవారుజామున యూపీలో ఆమె సజీవంగా ప్రత్యక్షమైంది.
దాంతో సోనమే కిరాయి హంతకులను పెట్టి తన భర్తను హత్య చేయించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సోనమ్ తాను హత్య చేయించలేదని చెబుతోంది. తన ఒంటిపై ఉన్న నగల కోసం కొందరు దుండగులు దాడి చేయగా తన భర్త అడ్డుకున్నాడని, దాంతో ఆయనను హత్య చేశారని అంటోంది. అయితే ఇందులో ఏది నిజమో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
#WATCH | Indore, Madhya Pradesh | Four people have been arrested in the Raja Raghuvanshi murder case, including Raj Singh Kushwaha.
Raj Kushwaha’s mother says, “My son cannot do anything like this. He is just 20 years old… He is my everything… My son worked in Sonam’s… pic.twitter.com/twqpT2JC28
— ANI (@ANI) June 10, 2025
#WATCH | Indore, MP: Four people have been arrested in the Raja Raghuvanshi murder case, including Raj Kushwaha.
Raj Kushwaha’s sister, says “Vicky and Raj both are my brothers. They can never do something like this. My brother Raj did not go anywhere. You can ask the people at… pic.twitter.com/EHeQ2WKPIH
— ANI (@ANI) June 10, 2025
Read More >>
రాజా రఘువంశీ హత్య కేసు.. నాలుగో నిందితుడికీ ట్రాన్సిట్ రిమాండ్
ఆ ముగ్గురు నిందితులకు 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్
‘సోనమ్ చాలా మంచిది.. అలాంటి పని చేయదు’
నన్ను కాపాడి నా భర్త హత్యకు గురయ్యాడు : దాబా ఓనర్‌తో సోనమ్ రఘువంశీ
రఘువంశీ తల ముందు, వెనుక బలమైన గాయాలు.. పోస్టుమార్టంలో వెల్లడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

