పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి నివాసాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. (RJD workers storm Lalu’s home) మఖ్దూంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సతీష్ కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. శనివారం మఖ్దూంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాట్నాలోని లాలూ ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు టికెట్ ఇవ్వవద్దంటూ అక్కడ గందరగోళం సృష్టించారు.
కాగా, లాలూ నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఆర్జేడీ కార్యకర్తలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. వారు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. నిరాకరించిన ఆ పార్టీ కార్యకర్తలు కొంతసేపు నిరసన కొనసాగించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पटना: लालू-राबड़ी के घर में लगे नारे- चोर विधायक नहीं चाहिए. मखदुमपुर से RJD विधायक का हुआ जमकर विरोध. @RJDforIndia @laluprasadrjd @yadavtejashwi #BiharPolitics #BiharElections2025 #RJD #Tejashwiyadav pic.twitter.com/ypLOm9z0F3
— Prabhat Khabar (@prabhatkhabar) October 4, 2025
Also Read:
Cow Cess On Liquor | మద్యంపై 20 శాతం ‘ఆవు పన్ను’.. బార్ బిల్లు ఫొటో వైరల్
Man jumps Into Yamuna With Children | ప్రియుడితో పారిపోయిన భార్య.. పిల్లలతో కలిసి నదిలో దూకిన భర్త
Watch: పెళ్లిలో సోదరుడి పాత్ర పోషించిన సైనికులు.. విధుల్లో మరణించిన వధువు అన్న లోటు తీర్చారు