గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 20:36:22

ఫారిన్‌ పోస్టాఫీసు సేవల పునరుద్ధరణ

ఫారిన్‌ పోస్టాఫీసు సేవల పునరుద్ధరణ

హైదరాబాద్‌‌: రాష్ట్రంలో ఫారిన్‌ పోస్టాఫీసు సేవలను పునరుద్ధరించారు. విదేశాలకు అత్యవసర సరుకుల రవాణాను తిరిగి ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ తపాలా సేవలను మార్చి 23 నుంచి నిలిపివేశారు. ఇటీవల పోస్టల్‌ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చిన తపాలాశాఖ.. ఫారిన్‌ పోస్టాఫీసుల ద్వారా స్పీడ్‌పోస్టులు, అత్యవసర వస్తువులు, ఔషధాల ఎగుమతులను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇండోనేషియా, జపాన్‌, కువైట్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, సౌదీఅరేబియా, యూఏఈ, యూకే, సింగపూర్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలతో అత్యవసర లావాదేవీలు కొనసాగనున్నాయి. చైనా, కొరియా దేశాలకు కూడా విజ్ఞప్తి మేరకు ఇంటర్నేషనల్‌ మెయిల్స్‌ను అనుమతించనున్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని హుమాయున్‌నగర్‌ ఫారిన్‌ పోస్టాఫీసు ద్వారా విదేశాలకు అత్యవసర సరుకుల ఎగుమతిని ప్రారంభించినట్టు హైదరాబాద్‌ సిటీ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టల్‌ కే వెంకట్‌రామిరెడ్డి తెలిపారు.


logo