e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి

మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి

మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 130 సైనిక పాడి పరిశ్రమలను భారత సైన్యం శాశ్వతంగా మూసివేసింది. 132 ఏండ్ల పాటు సేవలందించిన డెయిరీలను మూసివేయనున్నారు. కేంద్రాల్లో 25 వేల ఆవులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 35 మిలియన్ లీటర్ల పాలను ఉత్పత్తి చేసేవారు.

సుమారు 20 వేల ఎకరాల్లో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి నిర్వహణ కోసం ప్రతి ఏటా దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేసేవారు. సైనిక సంస్కరణల దృష్ట్యా వాటిని మూసివేయాలని నిర్ణయించినట్లు సైనికాధికారులు తెలిపారు.

ఢిల్లీ కంటోన్మెంట్‌లోని మిలిటరీ-ఫార్మ్స్ రికార్డ్స్ సెంటర్‌లో రద్దు కార్యక్రమం నిర్వహించి అధికారికంగా పాడి పరిశ్రమను మూసివేస్తున్న భారత సైన్యం ప్రకటించింది. సైనిక క్షేత్రాల నుంచి పాలు, ఇతర పాల-ఉత్పత్తుల సరఫరా సైన్యం మొత్తం సరఫరాలో కేవలం 14 శాతం మాత్రమే ఉన్నాయి.

సరిహద్దుల్లో మోహరించిన దళాలకు ప్యాక్ చేసిన పాలు సరఫరా ఎక్కువగా జరుగుతున్నందున డెయిరీలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రాలలో మోహరించిన సైనిక అధికారులు, పౌర రక్షణ సిబ్బంది ఇతర రెజిమెంట్లకు బదిలీ అయ్యారు.

బ్రిటిష్ కాలంలో 1889 లో లెఫ్టినెంట్ జనరల్ శశాంక్ మిశ్రా ఈ సైనిక పాడి పరిశ్రమలను ప్రారంభించినట్లు చరిత్రకారులు చెప్తారు. మొదటి సైనిక క్షేత్రం 1889 ఫిబ్రవరి 1 న అలహాబాద్‌లో ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ, జబల్‌పూర్, రాణిఖెట్, జమ్ము, శ్రీనగర్, లే, కార్గిల్, ఝాన్సీ, గువహతి, సికింద్రాబాద్, లక్నో, మీరట్, కాన్పూర్ సహా 130 ప్రదేశాలలో ఇటువంటి సైనిక క్షేత్రాలు ప్రారంభించారు.

స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఈ క్షేత్రాల్లో దాదాపు 30 వేల ఆవులు, ఇతర పశువులు ఉన్నట్లుగా సైనిక రికార్డులు చెప్తున్నాయి. ఈ సైనిక క్షేత్రాలు వ్యవసాయ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రపంచంలో అతిపెద్ద పశువుల క్రాస్ బ్రీడింగ్ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్-ఫ్రెసివల్ కింద నడిపించాయి.

ప్రతి సంవత్సరం ఈ సైనిక క్షేత్రాలు దాదాపు 25 వేల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం ఉత్పత్తి చేస్తాయి. ఈ దృష్ట్యా బయో ఇంధనం కోసం రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తో జతకట్టారు.

ఇవి కూడా చదవండి..

ఆల్‌ ఫూల్స్‌ డే.. ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? చరిత్రలో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మిలటరీ డెయిరీ ఫాంల మూసివేత.. 132 ఏండ్లు కొనసాగిన ఆర్మీ పాడి

ట్రెండింగ్‌

Advertisement