హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆవిష్కరణలను, స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ హబ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. దీంట్లోభాగంగా ఇండియా స్టార్టప్ సాహస యాత్రను దేశీయంగా ప్రధాన 11 నగరాల్లో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్దం చేసింది.
ఈ నెల 8న కోయంబత్తూరులో, 10న కోచి, 24న మంగళూరు, జూన్ 7న డెహరాడున్, లక్నోలో జూన్ 14న, సూరత్‌లో జూన్ 28న, జూలై 5న రాంచీలో, 19న జైపూర్‌లో, 26న ఇండోర్‌లో, ఆగస్టు 9న భువనేశ్వర్, 23న గౌహాతిలో నిర్వహిస్తున్నామని టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు.