ఆల్ ఫూల్స్ డే.. ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? చరిత్రలో ఈరోజు
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 న ఏప్రిల్ ఫూల్స్ డే లేదా ఆల్ ఫూల్స్ డేగా జరుపుకుంటారు. దీని ప్రారంభం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 న ఏప్రిల్ ఫూల్స్ డే లేదా ఆల్ ఫూల్స్ డేగా జరుపుకుంటారు. దీని ప్రారంభం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఏప్రిల్ ఫూల్ 1582 లో ప్రారంభమైంది.
ఫ్రాన్స్‌లో జూలియన్ క్యాలెండర్ స్థానంలో గ్రెగోరియన్ క్యాలెండర్ స్వీకరించబడింది. జూలియన్ క్యాలెండర్లో హిందూ న్యూ ఇయర్ మాదిరిగానే మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో సంవత్సరం ప్రారంభమవుతుంది. గ్రెగోరియన్ క్యాలెండర్.. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది.
క్యాలెండర్ మార్చడానికి మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ 1 వరకు కొందరు నూతన సంవత్సరాన్ని జరుపుకోవడంతో వారిపై చాలా జోకులు వేశారు. వారిని ఎగతాళి చేశారు. అప్పటి నుంచి ఏప్రిల్ ఫూల్ అని పిలువడం, ఆటపట్టించడం వంటి పనులు చేయడం మొదలైంది.
1700 ఏప్రిల్ 1 న, ఇంగ్లిష్ చిలిపివాళ్ళు ఒకరిపై ఒకరు ఆచరణాత్మక జోకులు వేసుకోవడం ద్వారా ఏప్రిల్ ఫూల్స్ డే వార్షిక సంప్రదాయం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చెప్తారు. ఏప్రిల్ ఫూల్‌ను హిలేరియాతో పోల్చుకుంటూ మార్చి చివరిలో పురాతన రోమ్‌లోని సిబెల్ సమాజ ప్రజలు పండుగ జరుపుకునేవారని చరిత్రకారులు చెప్తుంటారు. ఇందులో ప్రజలు మారువేషాలు వేసుకుని ఒకరినొకరు ఎగతాళి చేస్తారు.
దీనిని స్కాట్లాండ్లో రెండు రోజుల సంప్రదాయంగా జరుపుకుంటారు. వివిధ దేశాల్లో విభిన్న రీతుల్లో ఏప్రిల్ ఫూల్స్ డే ను జరుపుకుంటూ ఉంటారు. భారతదేశంలో 1964 లో ఏప్రిల్ ఫూల్ అనే చిత్రం నిర్మించారు. ఈ చిత్రంలోని ఒక పాట ‘ఏప్రిల్ ఫూల్ బనా, యునో అంగద్ ఆయా’ ఇప్పటికీ హుషారెత్తిస్తుంది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు:
2001: సేమ్ సెక్స్ పెండ్లిండ్లకు అనుమతించిన తొలి దేశంగా నెదర్ల్యాండ్స్ రికార్డు
1976 : దూరదర్శన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు
1976 : స్టీవ్ జాబ్స్, స్వీవ్ వోజ్నియాక్, రోనాల్డ్ వేన్లచే ఆపిల్ సంస్థ ప్రారంభం
1969 : భారతదేశపు తొలి అణు ఇంధన కేంద్రం మహారాష్ట్రలోని తారాపూర్‌లో ప్రారంభం
1936 : బిహార్ నుంచి విడివడి కొత్త రాష్ట్రంగా ఒడిశా ఏర్పాటు
1935 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభం
1933 : పాకిస్తాన్‌లోని కరాచీలో భారత వైమానిక దళం స్థాపన
1930 : దేశంలో బాలికలకు కనీస వివాహం వయస్సు 14, అబ్బాయిల వయస్సు 18 గా నిర్ణయం
1924 : బీర్ హాల్ విప్లవంలో పాల్గొన్నందుకు అడాల్ఫ్ హిట్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష విధింపు
1912 : దేశ రాజధానిగా, భారతదేశ ప్రావిన్స్‌గా ఢిల్లీ ప్రకటన
1891 : ఫ్రాన్స్, లండన్ మధ్య తొలి టెలిఫోన్ పరిచయాలు ప్రారంభం
1839 : కోల్‌కతా మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ప్రారంభం
1793 : జపాన్‌లో అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా సుమారు 53 వేల మంది దుర్మరణం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

