Mukesh Ambani | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపారవేత్తలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన కుమారులు ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ, కోడలు శ్లోకా మెహతాతో కలిసి ఓటు వేశారు.
#WATCH | Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani, his sons Anant Ambani and Akash Ambani, and daughter-in-law Shloka Mehta leave after casting their vote for the #MaharashtraElections2024. pic.twitter.com/gFEeRoYCnX
— ANI (@ANI) November 20, 2024
మహారాష్ట్రలో(Maharashtra) మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మాక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 23 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Assembly elections | మహా ఎన్నికలు.. ఓటేసిన సినీ ప్రముఖులు
Hit And Run | బైక్ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు.. జర్నలిస్ట్ మృతి