మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 13:01:54

బ‌తుకుదెరువు కోసం శ‌రీర‌మంతా శానిటైజ్ చేస్తున్నాం..

బ‌తుకుదెరువు కోసం శ‌రీర‌మంతా శానిటైజ్ చేస్తున్నాం..

న్యూఢిల్లీ : బ‌తుకుదెరువు కోసం వ్య‌భిచారం చేస్తున్న స్ర్తీల బాధ‌లు వ‌ర్ణ‌ణాతీతం. క‌రోనా వైర‌స్ కార‌ణంగా వారి జీవ‌నోపాధికి భంగం వాటిల్లింది. మ‌నుగ‌డ క‌ష్ట‌మై.. తిన‌డానికి తిండి లేక విల‌విల‌లాడిపోతున్నారు. ఒక వేళ వారి వ‌ద్ద‌కు విటులు వెళ్లినా.. వారితో త‌మ శ‌రీరాన్ని పంచుకునేందుకు భ‌య‌ప‌డుతున్నారు. క‌రోనా భ‌యంతో త‌మ శ‌రీరాన్ని అమ్ముకోవ‌డం లేదు. ఎన్నో బాధ‌లు, వ్య‌థ‌ల మ‌ధ్య వ్య‌భిచారిణుల జీవితం స‌త‌మ‌త‌వుతోంది. రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే విటుల వ‌ద్ద కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని వ్య‌భిచారం చేస్తున్నారు. 

ఢిల్లీలోని ఓ రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఇద్ద‌రు వ్య‌భిచారిణులు ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎంతో కాలం నుంచి ఈ వృత్తిలో ఉన్నాం. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా త‌మ వ్యాపారం పూర్తిగా దెబ్బ‌తిన్నది. రెగ్యుల‌ర్ విటుల కోసమే తాము అందంగా మేకప్ వేసుకుని ఉంటున్నాం. క‌రోనా కార‌ణంగా ఆ విటుల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం. త‌మ గ‌దిలోకి వ‌చ్చే ముందే.. ముఖానికి మాస్కు, చేతుల‌కు గ్లౌసులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలని చెబుతున్నాం. ఇక విటుల శ‌రీర‌మంతా శానిటైజ్ చేసి.. ప‌డుపు వృత్తిని కొన‌సాగిస్తున్నాం. ఒక‌ప్పుడు ఉన్నంత వ్యాపారం ఇప్పుడు లేదు. ఇప్పుడు రోజుకు ఒక‌రిద్ద‌రూ మాత్ర‌మే వ‌స్తున్నారు. విటులు వెళ్లిన త‌ర్వాత త‌మ గ‌దిని శానిటైజ్ చేస్తున్నాం. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని త‌మ వృత్తిని కొన‌సాగిస్తున్నామ‌ని ఆ ఇద్ద‌రు వ్య‌భిచారిణులు చెప్పారు. కొత్త వ్య‌క్తుల‌ను అస‌లు అనుమ‌తించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

మ‌రో వేశ్యాగృహానికి చెందిన మ‌రో స్ర్తీ మాట్లాడుతూ.. క‌రోనా కార‌ణంగా త‌మ ఉపాధి దెబ్బ‌తిన‌డంతో త‌మ స‌హ‌చ‌రులు అంద‌రూ సొంతూర్ల‌కు వెళ్లిపోయారు.  వ్య‌క్తులు రావ‌డం లేదు కాబ‌ట్టి.. మేక‌ప్ వేసుకోవ‌డం లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మేక‌ప్ వేసుకోవ‌డం వృథా ఖ‌ర్చు అని తెలిపింది. ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే పురుషులు వ‌స్తున్నారు. ఈ క‌రోనా ఎప్పుడు పోతుందో.. త‌మ బ‌తుకు ఎప్పుడు సాఫీగా సాగుతుందో వేచి చూడాల‌న్నారు. 


logo