వకీల్ సాబ్ 13 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..
వకీల్ సాబ్ 13 డేస్ కలెక్షన్స్ | వకీల్ సాబ్ సినిమా రూ.89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు సినిమా రూ.85 కోట్లు షేర్ వసూలు చేసింది.

వకీల్ సాబ్ 13 డేస్ కలెక్షన్స్ వచ్చేశాయి. ఏప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కరోనా సమయంలోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. తొలి నాలుగు రోజులు అయితే సింపుల్‌గా బాక్సాఫీస్‌ను కుమ్మేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ తర్వాత మాత్రం సినిమా దూకుడు తగ్గిపోయింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న పాత్రలో మెరిసింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్దాడు శ్రీరామ్ వేణు. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు బయటి ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా 13 రోజుల ఏరియా వైజ్ వసూళ్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం..

నైజాం- 24.10 కోట్లు
సీడెడ్- 12.71 కోట్లు
ఉత్తరాంధ్ర- 11.60 కోట్లు
ఈస్ట్- 6.14 కోట్లు
వెస్ట్- 7.13 కోట్లు
గుంటూరు- 7.07 కోట్లు
కృష్ణా- 4.88 కోట్లు
నెల్లూరు- 3.33 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 76.99 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.58 కోట్లు
ఓవర్సీస్- 3.83 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 85.03 కోట్లు షేర్
వకీల్ సాబ్ సినిమా రూ.89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు సినిమా రూ.85 కోట్లు షేర్ వసూలు చేసింది. పవన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం వకీల్ సాబ్. అత్తారింటికి దారేది రూ.81 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు వకీల్ సాబ్ ఆ సినిమాను దాటేసింది. అయితే కరోనా కారణంగా లక్ష్యానికి 5 కోట్ల దూరంలోనే ఆగిపోయాడు పవర్ స్టార్. చివరికి అబౌ యావరేజ్ గా నిలిచింది వకీల్ సాబ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ట్రక్కు డ్రైవర్ గా రకుల్‌ప్రీత్‌సింగ్
పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
అల్లు అర్జున్ పాటను వాడేసిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్‌తో అలరించేందుకు రెడీ..!
జాతి రత్నాలు సీక్వెల్‌కు సన్నాహాలు.. స్టోరీ లైన్ ఇదే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

