e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News అల్లు అర్జున్ పాట‌ను వాడేసిన స‌ల్మాన్ ఖాన్.. వీడియో వైర‌ల్

అల్లు అర్జున్ పాట‌ను వాడేసిన స‌ల్మాన్ ఖాన్.. వీడియో వైర‌ల్

అల్లు అర్జున్ పాట‌ను వాడేసిన స‌ల్మాన్ ఖాన్.. వీడియో వైర‌ల్

సంగీతానికి బౌండరీస్ ఉండవు. పాట బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఎల్లలు దాటిపోతోంది. ముఖ్యంగా తెలుగు పాటలు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి. మన సంగీతం బాలీవుడ్ లో కూడా వినిపిస్తోంది. ఇక్కడ సంచలనం రేపుతున్న దేవి శ్రీ ప్రసాద్, తమన్ లాంటి సంగీత దర్శకుల పాటలు హిందీలో అడిగి మరీ తీసుకుంటున్నాడు దర్శకులు. తాజాగా సల్మాన్ ఖాన్ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈయన నటిస్తున్న రాధే సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకుడు. ఇదివరకే సల్మాన్ ఖాన్ తో వాంటెడ్, దబాంగ్ 3 లాంటి సినిమాలు చేశాడు ప్రభుదేవా. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మూడో సినిమా వస్తుంది.

ప్రతిసారి రంజాన్ సందర్భంగా ఒక సినిమాను విడుదల చేయడం సల్మాన్ ఖాన్ కు అలవాటు. గతేడాది థియేటర్లు మూతపడడం.. దానికి తోడు లాక్ డౌన్ కూడా ఉండడంతో సినిమా విడుదల కాలేదు. అయితే ఈసారి కూడా పరిస్థితులు బాగా లేకపోయినా రాధే సినిమాను ఈద్ కు విడుదల చేస్తున్నారు. మే 13న ఒకేసారి థియేటర్లలో, డిజిటల్ ప్లాట్ ఫాంలో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ట్రైలర్ లో అల్లు అర్జున్ సీటీ మార్ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాటను తన సినిమా కోసం వాడుకున్నాడు సల్మాన్ ఖాన్.

గతంలోనూ దేవి శ్రీ ప్రసాద్ పాటలు సల్మాన్ వాడుకున్నాడు. అప్పట్లో విడుదలైన కిక్ సినిమాలో రింగ రింగా పాట దేశ వ్యాప్తంగా ఒక ఊపు ఊపింది. ఇప్పుడు సీటీ మార్ కూడా సంచలనం రేపేలా కనిపిస్తుంది. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే డిజె సినిమా రీమేక్ లా అనిపిస్తుంది. పైగా ప్రభుదేవా సొంత కథలు చేయడం ఎప్పుడో మానేశాడు. ఏదేమైనా సల్మాన్ ఖాన్ సినిమాలో అల్లు అర్జున్ పాట ఉండడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అల్లు అర్జున్ పాట‌ను వాడేసిన స‌ల్మాన్ ఖాన్.. వీడియో వైర‌ల్

ట్రెండింగ్‌

Advertisement