Delhi Blast | ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) వద్ద భారీ పేలుడు (Delhi Blast)కు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బ్లాస్ట్‌కు ముందు డాక్టర్ ఉమర్ నబీ (Dr Umar Un Nabi) ఓల్డ్ ఢిల్లీలోని ఓ మసీదు (mosque)ను సందర్శించారు. తుర్క్మాన్గేట్ ఎదురుగా ఉన్న రాంలీలా మైదాన్ (Ramlila Maidan) సమీపంలోని ఫైజ్-ఎ-ఇలాహి మసీదునుంచి ఉమర్ బయటకు వస్తున్న దృష్యాలు అక్కడే ఉన్న నిఘా కెమెరాలో నిక్షిప్తమై ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అతడు మసీదును సందర్శించినట్లు తెలుస్తోంది. దాదాపు 10 నిమిషాలపాటూ అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఎర్రకోటవైపు వెళ్లినట్లుగా సమాచారం.
VIDEO | Delhi terror attack: CCTV visuals show suspect Dr Umar Nabi, who was driving the explosives-laden car, leaving the mosque near Turkman Gate before the blast on Monday evening.
(Source: Third Party)#Delhiattack
(Full video available on PTI Videos -… pic.twitter.com/Bpu51nDO4O
— Press Trust of India (@PTI_News) November 13, 2025
బాంబు పేలుడు సంభవించిన ఐ20 కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీ (Dr Umar Un Nabi) అని తేలింది. కారులో లభించిన నమూనాలతో అతని డీఎన్ఏ (DNA) సరిపోలడంతో కారు నడిపింది నబీయేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించారు. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న అతను కూడా ప్రాణాలు కోల్పోయాడని అధికారులు అనుమానించారు. ఈ నేపథ్యంలో పుల్వామాలో ఉన్న అతని తల్లి నుంచి డీఎన్ఏ నమూనాలు తీసుకొని పరీక్షించారు. కారు స్టీరింగ్, యాక్సిలరేటర్ మధ్య ఇరుక్కున్న కాలు నుంచి సేకరించి డీఎన్ఏను ఆమె డీఎన్ఏతో సరిపోల్చారు. దీంతో కారులో లభించిన డీఎన్ఏ ఉమర్ నబీదేనని తేలినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Delhi terror blast case | In a viral CCTV footage confirmed by Delhi Police, the accused Dr Umar Un Nabi can be seen at Turkman Gate Mosque near Red Fort. pic.twitter.com/wDFAaySf3D
— ANI (@ANI) November 13, 2025
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడు ఉగ్రవాద దాడే : అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో
Delhi Blast Case | సరిపోలిన డీఎన్ఏ.. ఆ కారు నడిపింది డాక్టర్ ఉమర్ నబీయేనని నిర్ధారణ
26/11 తరహా దాడులకు కుట్ర.. దేశవ్యాప్తంగా పేలుళ్లకు జైషే పన్నాగం..!