IMD | దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది. రానున్న మూడు రోజులు రాజధానిలో ఎండ తీవ్రత అధికంగా (heatwave in Delhi) ఉంటుందని తెలిపింది. గురువారం వరకూ వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే, సాయంత్రం సమయంలో వాతావరణం చల్లబడుతుందని తెలిపింది. వారాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
కాగా, సోమవారం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. సఫ్దర్జంగ్లో 43.4 డిగ్రీల సెల్సియస్, పాలెంలో 44.3 డిగ్రీల సెల్సియస్, లోధి రోడ్డులో 43.3 డిగ్రీల సెల్సియస్, రిడ్జ్‌లో 44.9 డిగ్రీలు, అయా నగర్లో 45.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో నిన్న రాజధానిలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read..
Earthquakes | భారత్-మయన్మార్ సరిహద్దుల్లో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా..
Massive Fire | ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి
Meghalaya murder | ‘రాజా ఫోన్ పనిచేస్తోందా..?’ అత్త ప్రశ్నకు కోడలు సోనమ్ ఏం చెప్పిందంటే..!