Earthquakes | భారత్-మయన్మార్ సరిహద్దుల్లో (India-Myanmar border) వరుస భూకంపాలు (Earthquakes) సంభవించాయి. గత 36 గంటల్లో ఏకంగా ఆరుసార్లు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8 నుంచి 4.5 మధ్య నమోదైంది. చివరిసారిగా మంగళవారం ఉదయం 11:21 గంటల సమయంలో 4.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనల ధాటికి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లోనూ భూమి కంపించింది. వరుస భూ ప్రకంపనలతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రకంపనలు స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
కాగా, ఈ ఏడాది మార్చి 28న మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై 7.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ శక్తిమంతమైన భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. మయన్మార్ అధికారుల ప్రకారం.. ఈ విపత్తులో దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంపం ధాటికి పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (IFRC) ప్రకారం.. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 200,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక మధ్య మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలు ప్రతిరోజూ కుదుపులకు గురవుతున్నాయి.
Also Read..
Massive Fire | ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి
Meghalaya murder | ‘రాజా ఫోన్ పనిచేస్తోందా..?’ అత్త ప్రశ్నకు కోడలు సోనమ్ ఏం చెప్పిందంటే..!