Massive Fire | ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి
Massive Fire | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Massive Fire | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ద్వారకా సెక్టార్-13 లోని శపథ సొసైటీలో మంగళవారం ఉదయం 9:58 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లోని ఎనిమిది, తొమ్మిది అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన నివాసితులు ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందకు దూకేశారు. అలా ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తండ్రి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
ముందుగా పదేళ్ల ఇద్దరు చిన్నారులు ప్రమాదం నుంచి బయటపడేందుకు బాల్కనీ నుంచి కిందుకు దూకేశారు. పిల్లల తండ్రి 35 ఏళ్ల యష్ యాదవ్ కూడా కిందకు దూకాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
పలువురు నివాసితులు ఈ మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఎనిమిది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు. భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
#WATCH | Delhi: Fire broke out in a flat on the seventh floor of Sabad Apartment, Dwarka Sector 13. 8 fire tenders have reached the spot. Two to three people are expected to be trapped. Fire-fighting operations are undergoing. No information about anyone being injured: Delhi Fire… pic.twitter.com/feLVOkyP0g
— ANI (@ANI) June 10, 2025
Also Read..
INS Surat | నౌకలో అగ్నిప్రమాదం.. 18 మందిని మంగళూరు పోర్టుకు తరలించిన ఐఎన్ఎస్ సూరత్
Sunita Williams | సునీతా విలియమ్స్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

