Sunita Williams | భారత సంతతి వ్యోమగామి (astronaut) సునీతా విలియమ్స్ (Sunita Williams) మొదటి మైనపు విగ్రహం ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని అసన్సోల్ (Asansol)లో సుశాంత రాయ్ అనే శిల్పి సునీత మైనపు విగ్రహాన్ని (Wax statue of Sunita Williams) రూపొందించారు. తన సొంత మ్యూజియంలో (Bengal museum) ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆ రాష్ట్ర మంత్రి మోలోయ్ ఘటక్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శిల్పి సుశాంత్ రాయ్ (Susanta Ray) మాట్లాడుతూ.. సునీతా విలియమ్స్ విగ్రహాన్ని తయారు చేయడానికి తనకు నెలన్నర సమయం పట్టినట్లు చెప్పారు. వ్యోమగాములు ధరించే సూట్ దొరక్కపోవడంతో విగ్రహావిష్కరణకు ఇంత సమయం పట్టినట్లు తెలిపారు. ఆ దుస్తుల కోసం తొలుత నాసాను సంప్రదించినట్లు సుశాంత్ రాయ్ పేర్కొన్నారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో.. చివరికి తన స్నేహితుడి సాయంతో అమెరికా నుంచి దుస్తులు తెప్పించినట్లు వివరించారు.
8 రోజుల అంతరిక్ష యాత్రలో భాగంగా సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం తెలిసిందే. అంతరిక్షానికి చేరుకునే క్రమంలోనే స్టార్‌లైనర్ ‘కాలిప్సో’లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హీలియం లీకేజీ, థ్రస్టర్స్ ఓవర్‌హీటింగ్ తదితర కారణాల వల్ల వారు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. 286 రోజులపాటూ ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన వ్యోమగాములు ఈ ఏడాదిమార్చిలో క్షేమంగా భూమికి చేరిన విషయం తెలిసిందే.
Also Read..
Honeymoon murder | రాజా రఘువంశీ హత్య కేసు.. నాలుగో నిందితుడికీ ట్రాన్సిట్ రిమాండ్