మంగళవారం 14 జూలై 2020
National - Jun 23, 2020 , 20:22:44

రాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్లతో పరీక్షలు : యూపీ అడిషన్‌ చీఫ్‌ సెక్రెటరీ

రాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్లతో పరీక్షలు : యూపీ అడిషన్‌ చీఫ్‌ సెక్రెటరీ

లక్నో : రాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్లు ఉత్తరప్రదేశ్‌కు వచ్చాయని, రేపటి నుంచి ఆరు జిల్లాలో కరోనా పరీక్షలకు వాటిని వినియోగించనున్నట్లు  రాష్ట్ర అదనపు చీఫ్‌ సెక్రెటరీ (హోం) అవనీశ్‌ కే అవాస్తి తెలిపారు. నోయిడా, ఘజియాబాద్, లక్నో, గోరఖ్‌పూర్, వారణాసి, కాన్పూర్‌నగర్ జిల్లాలపై దృష్టి పెట్టినట్లు విలేకరులతో సమావేశంలో పేర్కొన్నారు. మెడికల్ స్క్రీనింగ్ కోసం లక్ష మంది స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 3,56,28,696 రేషన్ కార్డులున్నాయని, 66శాతం మందికి ఆరో విడత రేషన్‌ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ప్రిన్సిపల్‌ హెల్త్‌ సెక్రెటరీ అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ నిత్యం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఆశ వర్కర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా 1206 శాంపిల్స్‌ను పరిశీలించగా, అందులో 212 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. 6205 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 7188 మంది ఫెసిలిటీ క్వారంటైన్ కింద ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20,753 ప్రాంతాలను పర్యవేక్షించగా, వాటిలో 7,164 హాట్‌స్పాట్లు, కంటైన్‌మెంట్‌ జోన్లు, 13,589 నాన్ హాట్ స్పాట్ జోన్లు ఉన్నాయని వివరించారు. లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రానికి 18,18,405  మంది వలస కార్మికులు తిరిగి  వచ్చినట్లు ఆశ కార్యకర్తలు గుర్తించినట్లు చెప్పారు. వీరిలో 1,523 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 1,206 పరీక్షా ఫలితాలు రాగా, 212 పాజిటివ్, 994 నెగిటివ్ వచ్చినట్లు ప్రసాద్‌ తెలిపారు. 


logo