Ram Mandir | అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రామ్‌లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రధాన వేడుకలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మొదట బాలరాముడికి మహాభిషేకం నిర్వహించారు. పంచామృతం, సరయూ నది నుంచి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు ఉదయం నుంచే ఆలయంలో క్యూ కట్టారు. కాగా, నేటి నుంచి జనవరి 13 వరకూ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. బాలరాముడికి అభిషేకం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
మరోవైపు తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. ఎక్స్ అకౌంట్లో ఆయన పోస్టు చేస్తూ.. భారతీయ సంస్కృతి, ఆధ్మాత్మికతకు గొప్ప వారసత్వంగా ఈ ఆలయం నిలుస్తుందని ఆయన అన్నారు. ఎన్నో శతాబ్ధాల త్యాగాలు, పోరాటాల ద్వారా ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. నూతన భారత్‌ను నిర్మించే అంశంలో ఈ దివ్య, భవ్య అయోధ్య రామాలయం దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
#WATCH | Shri Ram Lalla Mahabhishek performed at Ram Janmabhoomi Temple in Ayodhya on the occasion of the first anniversary of ‘Pran Pratishtha’
(Source: DD National) pic.twitter.com/ZmetO4ODOE
— ANI (@ANI) January 11, 2025
Also Read..
PM Modi: అయోధ్య రామాలయ తొలి వార్షికోత్సవం.. గ్రీటింగ్స్ చెప్పిన ప్రధాని మోదీ
K Annamalai | హిందీ భాషపై అశ్విన్ వ్యాఖ్యలు.. అన్నామలై ఏమన్నారంటే..?
HMPV Case | అస్సాంలో 10 నెలల చిన్నారికి HMPV పాజిటివ్.. ఈ సీజన్లో ఇదే తొలి కేసు