K Annamalai | తమిళనాడు రాష్ట్రంలో మరోసారి తమిళ్, హిందీ వివాదం తెరపైకి వచ్చింది. అందుకు కారణంగా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) చేసిన వ్యాఖ్యలే. చెన్నైలోని ఓ కళాశాల ఈవెంట్‌కు హాజరైన అశ్విన్.. హిందీ జాతీయ భాష కాదని పేర్కొన్నారు. హిందీ కేవలం అధికారిక భాష మాత్రమే అని వ్యాఖ్యానించారు. క్రికెటర్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను కొందరు తప్పుపడుతుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు.
ఇక ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై (K Annamalai) స్పందించారు. హిందీ భాషపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని అన్నామలైని మీడియా కోరగా.. ‘అశ్విన్ చెప్పింది కరెక్ట్. హిందీ జాతీయ భాష కాదు. హిందీ అనేది కేవలం లింక్ లాంగ్వేజ్ మాత్రమే’ అని అన్నామలై స్పష్టం చేశారు. హిందీపై అశ్విన్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పేర్కొనడం ఇప్పుడు మరింత చర్చకు దారి తీస్తోంది.
#WATCH | Madurai: On cricketer Ravichandran Ashwin’s “Hindi not our national language” statement, Tamil Nadu BJP president K Annamalai says, “Correct. It is not our national language which Annamalai is also telling you. Not only my dear friend Ashwin has to say that…It is not… pic.twitter.com/hddBuznvy8
— ANI (@ANI) January 10, 2025
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాల స్నాతకోత్సవానికి అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషల గురించి విద్యార్థులను ప్రశ్నించారు. అయితే, హిందీ భాష గురించి ఒకరిద్దరి నుంచి మాత్రమే సమాధానం వచ్చింది. దీనిపై స్పందించిన క్రికెటర్.. ‘హిందీ అధికారిక భాష మాత్రమే. జాతీయ భాష కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
కాగా, రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరిగిన మూడవ టెస్టు చివరి రోజు అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించేశాడు. టెస్టు కెరీర్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. అతను 106 టెస్టుల్లో 24 యావరేజ్లో 537 వికెట్లు తీసుకున్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత రెండో స్థానంలో ఉన్నాడతను. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో అశ్విన్ 11 సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. మేటి స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో సమానంగా నిలిచాడు.
Also Read..
Ravichandran Ashwin | హిందీ జాతీయ భాష కాదు : రవిచంద్రన్ అశ్విన్
KL Rahul: కేఎల్ రాహుల్ సెలక్షన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన బీసీసీఐ కమిటీ
IND vs IRE | తొలి వన్డేలో భారత్ సునాయస విజయం.. రాణించిన ప్రతీక, తేజల్