ముంబై: ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన మూడవ ఇండియన్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్(KL Rahul) నిలిచాడు. అతను 30.66 సగటుతో 10 ఇన్నింగ్స్‌లో 276 రన్స్ చేశాడు. అయితే ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసిన రాహుల్.. త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని భావించాడు. దీని కోసం అతను రెస్ట్ కోసం బీసీసీఐ నుంచి అనుమతి కూడా తీసుకున్నాడు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు రాహుల్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. కేఎల్ రాహుల్‌పై దృష్టి పెట్టింది.
నిజానికి తొలుత రాహుల్‌కు రెస్ట్ ఇవ్వాలని భావించినా.. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండాలన్న అభిప్రాయాన్ని బీసీసీఐ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడితే, ఆ మెగా టోర్నీకి మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్‌తో పాటు కేఎల్ రాహుల్ కూడా పోటీలో ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి రాహుల్‌ను ఎంపిక చేయాలనుకున్న బీసీసీఐ.. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లోనూ ఆడాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే జట్టు వివరాలను కూడా ప్రకటించేందుకు ఐసీసీ నుంచి మరింత సమయాన్ని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. షమీ, హర్షదీప్ సింగ్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వరున్ చక్రవర్తి లాంటి పేర్లు చాంపియన్స్ ట్రోఫీ కోసం వినిపిస్తున్నాయి. కానీ దీపై మాత్రం ఇంకా పూర్తి క్లారిటీ రావడం లేదు.