HMPV Case | అస్సాం (Assam)లో తొలి హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) కేసు నమోదైంది. 10 నెలల చిన్నారికి హెచ్ఎమ్పీవీ సోకినట్లు గుర్తించారు. ఈ సీజన్లో ఇదే తొలి కేసు అని అధికారులు శనివారం తెలిపారు.
బాధిత చిన్నారి దిబ్రూఘర్ (Dibrugarh)లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం చలి సంబంధిత లక్షణాలతో చిన్నారి ఆసుపత్రిలో చేరినట్లు సూపరింటెండెంట్ ధృబజ్యోతి భుయాన్ తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొన్నారు. ఇది సాధారణ వైరస్ అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, 2014 నుంచి దిబ్రూగఢ్ జిల్లాలో 110 హెచ్ఎమ్పీవీ కేసులు గుర్తించినట్లు ఐసీఎమ్ఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ బిశ్వజిత్ తెలిపారు.
Also Read..
“HMPV | చైనాలో మరో మహమ్మారి.. మృతులతో నిండిపోతున్న శ్మశానాలు ?”
“HMPV | చైనాలో హ్యుమన్ మెటాప్న్యూమో వైరస్ విజృంభణ..! అప్రత్తమైన భారత ప్రభుత్వం..!”
“HMVP | చైనా వైరస్లపై ఆందోళన వద్దు.. ప్రజలకు కేంద్రం భరోసా”
“HMPV | భారత్లోకి ప్రవేశించిన చైనా వైరస్.. హెచ్ఎమ్పీవీ లక్షణాలు ఇవే..!”
“HMPV | ఇప్పటికే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ.. బాంబ్ పేల్చిన ఐసీఎంఆర్”
“HMPV | హెచ్ఎంపీవీ కలకలం.. ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టండిలా..!”