న్యూఢిల్లీ: అయోధ్యలో కొత్త నిర్మించిన రామ మందిరంలో రామ్‌లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. ఎక్స్ అకౌంట్లో ఆయన పోస్టు చేస్తూ.. భారతీయ సంస్కృతి, ఆధ్మాత్మికతకు గొప్ప వారసత్వంగా ఈ ఆలయం నిలుస్తుందని ఆయన అన్నారు. ఎన్నో శతాబ్ధాల త్యాగాలు, పోరాటాల ద్వారా ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. నూతన భారత్‌ను నిర్మించే అంశంలో ఈ దివ్య, భవ్య అయోధ్య రామాలయం దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
अयोध्या में रामलला की प्राण-प्रतिष्ठा की प्रथम वर्षगांठ पर समस्त देशवासियों को बहुत-बहुत शुभकामनाएं। सदियों के त्याग, तपस्या और संघर्ष से बना यह मंदिर हमारी संस्कृति और अध्यात्म की महान धरोहर है। मुझे विश्वास है कि यह दिव्य-भव्य राम मंदिर विकसित भारत के संकल्प की सिद्धि में एक… pic.twitter.com/DfgQT1HorT
— Narendra Modi (@narendramodi) January 11, 2025