Rajnath Singh | పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లోని ఆర్జీ కార్ మెడికల్ వైద్య కళాశాలలో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యాచార ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తాజాగా స్పందించారు. ఈ ఘటన అమానవీయమైనదని పేర్కొన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలను చూస్తుంటే (crimes against women) ఎన్ని మార్పులు చేసినా ఇంకా చేయాల్సింది చాలా ఉందనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
కేరళలోని తిరువనంతపురం (Thiruvananthapuram)లో ఓ కార్యక్రమంలో రాజ్నాథ్ పాల్గొని మాట్లాడారు. అత్యాచారం వంటి నేరాలకు కఠిన శిక్షలు అమలు చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టాలను సవరించినట్లు తెలిపారు. మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. మహిళలపై నేరాల విషయంలో కేంద్రం కఠిన వైఖరి అవలంభిస్తోందన్నారు. అయితే, ఈ విషయంలో కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు.
Also Read..
Ramdas Soren | చంపై స్థానంలో.. రాష్ట్ర మంత్రిగా రామదాస్ సోరెన్ ప్రమాణం
Jayasurya | లైంగిక వేధింపుల ఆరోపణలు.. నటుడు జయసూర్యపై రెండో కేసు నమోదు
Landslides | కొండచరియలు విరిగిపడి.. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి