Anushka Shetty | అనుష్క పెళ్లి వార్తలు ఫేక్.. వయసుపై కామెంట్లు చేయడం ఆపండి: ‘టీమ్ అనుష్క’ ఆగ్రహం
Anushka Shetty | టాలీవుడ్ జేజమ్మగా అభిమానుల మన్ననలు పొందిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వివాహం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె వ్యక్తిగత బృందం ‘టీమ్ అనుష్క’ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా ఆమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Anushka Shetty | టాలీవుడ్ జేజమ్మగా అభిమానుల మన్ననలు పొందిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వివాహం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె వ్యక్తిగత బృందం ‘టీమ్ అనుష్క’ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా ఆమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేవలం వ్యూస్, క్లిక్స్ కోసం ఒకరి వ్యక్తిగత జీవితాన్ని సెన్సేషనల్‌గా మార్చడం సరైంది కాదని టీమ్ అనుష్క మీడియా సంస్థలకు హితవు పలికింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యంగా అనుష్క వయసుపై జరుగుతున్న చర్చను టీమ్ తప్పుబట్టింది. ప్రతి వార్తలోనూ ‘44’ అనే వయసును ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ చర్చించడం సరైంది కాదని పేర్కొంది.
వయసు నిజంగా సమస్య అయితే, ఇదే ఉత్సాహం సీనియర్ హీరోల వయసు విషయంలో ఎందుకు కనిపించదు? అని ప్రశ్నించింది. కేవలం మహిళా నటీమణుల వయసు, వారి వ్యక్తిగత నిర్ణయాలను టార్గెట్ చేయడం వివక్షతో కూడిన చర్య అని పేర్కొంది. అనుష్క తన సినీ కెరీర్‌ను కేవలం ప్రతిభ, కష్టంతోనే నిర్మించుకున్నారని టీమ్ గుర్తు చేసింది. ఆమె ఎప్పుడూ చీప్ పబ్లిసిటీ లేదా పీఆర్ స్టంట్స్‌పై ఆధారపడలేదని స్పష్టం చేసింది. అలాగే తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే ఆమె హక్కును గౌరవించాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది. వివాహం అనేది ఒక వ్యక్తిగత విషయం. అది బ్రేకింగ్ న్యూస్ కాదు, సోషల్ మీడియా ట్రెండ్ కూడా కాదు. ఏ వార్తను ప్రచురించే ముందు నిజాన్ని నిర్ధారించుకోవడం మీడియా కనీస బాధ్యత అని టీమ్ అనుష్క స్పష్టం చేసింది.
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే గౌరవాన్ని హీరోయిన్లకు కూడా ఇవ్వాలని టీమ్ అనుష్క డిమాండ్ చేసింది. ఒక నటిగా ఆమె సాధించిన విజయాలను పక్కన పెట్టి, కేవలం పెళ్లి, వయసు వంటి అంశాలనే హైలైట్ చేయడం అన్యాయమని పేర్కొంది. ఇకనైన హద్దులను గౌరవించి నిరాధారమైన వార్తలకు స్వస్తి పలకాలని మీడియా సంస్థలకు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అనుష్క శెట్టి తన తదుపరి సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె వివాహానికి సంబంధించిన ఏదైనా విషయం ఉంటే అధికారికంగా తామే ప్రకటిస్తామని, అప్పటివరకు వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని అభిమానులకు సూచించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

