Landslides | కొండచరియలు విరిగిపడి.. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి
Landslides | పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి (Landslides) ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Landslides | పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి (Landslides) ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నట్లు పాకిస్థాన్ మీడియా నివేదించింది.
శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province) లోని అప్పర్ దిర్ జిల్లాలో గల మైదాన్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అవి నేరుగా ఓ ఇంటిపై పడటంతో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు కాగా, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సదరు అధికారిని ఊటంకిస్తూ డాన్ వార్తాపత్రిక పేర్కొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. శిథిలాల కింద నుంచి మొత్తం 12 మంది మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది.
కాగా, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పాకిస్థాన్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ భారీ వర్షాలకు ముర్రే, గల్లియత్, మన్సెహ్రా, కోహిస్తాన్, చిత్రాల్, దిర్, స్వాత్, షాంగ్లా, బునేర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read..
Actor Darshan | సన్‌గ్లాసెస్‌తో బళ్లారి జైల్లోకి దర్శన్ ఎంట్రీ.. పోలీసులపై చర్యలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

