Kadambari Jethwani | అన్ని రాష్ట్రాల్లో హనీట్రాప్ కేసులో నిందితురాలు.. ఏపీలో మాత్రం బాధితురాలు ఎలా అయ్యింది.. ముంబై నటి వివాదంపై వైసీపీ రియాక్షన్
Kadambari Jethwani | బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరీ జత్వానీ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేయడం.. అనంతరం బ్లాక్మెయిల్ చేయడంలో సిద్ధహస్తురాలు అని వైసీపీ ఆరోపించింది. ఫోర్జరీ సంతకాలు చేయడం, బోగస్ పత్రాలు సృష్టించడం కూడా ఆమెకు అలవాటే అని పేర్కొంది.
Kadambari Jethwani | ముంబై నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు, కొంతమంది ఐపీఎస్ అధికారులు కలిసి తనను వేధించారని, ఆటబొమ్మలా వాడుకుని.. అక్రమ కేసులు పెట్టారని జత్వానీ చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో వైసీపీ తీవ్రంగా స్పందించింది. వైసీపీపై బురదజల్లేందుకు రెండు రోజులుగా టీడీపీ, పచ్చ మీడియా విశ్వ ప్రయత్నం చేస్తుందని విమర్శించింది. సూపర్ 6 హామీలను అమలు చేయలేక.. ప్రజలను తప్పదోవ పట్టించేందుకు.. హనీట్రాప్ చేసే మహిళను తెరపైకి తీసుకొచ్చి నాటకం ఆడుతోందని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో నిందితురాలు అయిన జత్వానీ.. ఏపీలో మాత్రం బాధితురాలు ఎలా అవుతుందని ప్రశ్నించింది.
బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరీ జత్వానీ బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్ చేయడం.. అనంతరం బ్లాక్మెయిల్ చేయడంలో సిద్ధహస్తురాలు అని వైసీపీ ఆరోపించింది. ఫోర్జరీ సంతకాలు చేయడం, బోగస్ పత్రాలు సృష్టించడం కూడా ఆమెకు అలవాటే అని పేర్కొంది. ఈ విషయాలన్నీ పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయని.. పలు రాష్ట్రాల్లో ఆమెపై హనీట్రాప్ కేసులు బుక్కయ్యాయని బయటపెట్టింది. పలు రాష్ట్రాల్లో ఆమెపై హానీట్రాప్ కేసులు ఉండగా.. ఏపీలో మాత్రం బాధితురాలిగా చిత్రీకరిస్తున్నారని మండిపడింది.
సూపర్-6 హామీలను అమలు చేయలేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీడీపీ, ఎల్లో మీడియా కలిసి.. హనీ ట్రాప్ చేసే మహిళను తెరపైకి తెచ్చి నాటకం ఆడుతోంది
ఆ బురదను వైయస్ఆర్ సీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులకి రుద్దడానికి @JaiTDP ప్రయత్నిస్తోంది
అన్ని రాష్ట్రాలలో నిందితురాలు అయిన ఆమె.. ఏపీలో… pic.twitter.com/Uaisx94WjX
— YSR Congress Party (@YSRCParty) August 29, 2024
జత్వానీ బ్లాక్‌మెయిలింగ్ దందాను ఆసరాగా తీసుకుని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరతీసిందని వైసీపీ మండిపడింది. బాధితులకు బాసటగా నిలవాల్సిందిపోయి.. బాధితులనే బెదిరింపులకు గురి చేసే వ్యూహం పన్నిందని ఆరోపించింది. జత్వానీ హనీట్రాప్‌కి బలై కోట్లకు కోట్లు సమర్పించుకున్న పారిశ్రామికవేత్తలనే దోషులకు చిత్రీకరించి చంద్రబాబు సర్కార్ వేధింపులకు పాల్పడుతుందని విమర్శించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

