Seetha Payanam | ఓటీటీలోకి వచ్చేసిన ‘సీతా పయనం’.. ఎక్కడ చూడొచ్చంటే?
Seetha Payanam Movie | యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ వెండితెరకు పరిచయమైన క్లాసిక్ ప్రేమకథా చిత్రం ‘సీతా పయనం’ (Seetha Payanam) ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
Seetha Payanam Movie | యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ వెండితెరకు పరిచయమైన క్లాసిక్ ప్రేమకథా చిత్రం ‘సీతా పయనం’ (Seetha Payanam) ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘సన్ నెక్స్ట్’ (Sun NXT) నేటి నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ముఖ్యంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగపూరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. తల్లి లేని సీతను తండ్రి రాజేంద్ర ప్రసాద్ (సత్యరాజ్) ఎంతో అల్లారుముద్దుగా పెంచుతాడు. అయితే పెళ్లిపై ఏమాత్రం ఆసక్తి లేని సీత, వైజాగ్ నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణంలో అభి (నిరంజన్ సుధీంద్ర) అనే యువకుడిని కలుస్తుంది. ఆ ప్రయాణం ఆమె ఆలోచనలను, జీవితాన్ని ఎలా మార్చింది అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని మలిచారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర సోదరుడి కుమారుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటించగా, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు అర్జున్ సర్జా ఒక ముఖ్య పాత్రలో మెరవగా, ఆయన మేనల్లుడు ధ్రువ సర్జా ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించడం విశేషం. అనూప్ రూబెన్స్ అందించిన ఫీల్ గుడ్ సంగీతం ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

