Peddinti Ashok Kumar | తెలంగాణ జన జీవన పోరాటాలను, సామాన్యుల ఆరాటాలను తన కలం ద్వారా కథలుగా మలుస్తున్న ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల అశోక్ కుమార్ రాసిన ‘మాయి ముంత’ కథా సంపుటిని చదివిన కేటీఆర్, ఆ కథలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ముఖ్యంగా ఇందులోని ‘మాయి ముంత’, ‘సావు దప్పు’, ‘జిద్దు’ వంటి కథలు తనను లోతుగా కదిలించాయని, ఇవి కేవలం కథలు మాత్రమే కావని, మన అస్తిత్వపు వేదనలకు నిలువుటద్దాలని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీయ సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే అద్భుతమైన రచనలుగా వీటిని అభివర్ణించిన కేటీఆర్, మట్టి పరిమళాల రచయితగా గుర్తింపు పొందిన అశోక్ కుమార్‌కు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలంగాణ మట్టి వాసనను, ఇక్కడి మనుషుల జీవన శైలిని ప్రతిబింబించే ఇలాంటి గొప్ప రచనలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.