Ramdas Soren | జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ కేబినెట్లో కొత్త మంత్రిగా రామదాస్ సోరెన్ (Ramdas Soren) శుక్రవాం ప్రమణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. రామదాస్ సోరెన్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ (Santosh Kumar Gangwar) ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు ఇతర కేబినెట్ మంత్రులు హాజరయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ (Champai Soren) స్థానంలో రామదాస్ సోరెన్ మంత్రి వర్గంలోకి (Jharkhand Minister) అడుగుపెట్టారు. జేఎంఎంకు చంపై సోరెన్ ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. దీంతో మంత్రివర్గంలో చంపై స్థానంలోకి రామదాస్ సోరెన్ ప్రభుత్వం తీసుకుంది. సింగ్భమ్ జిల్లాలోని ఘట్శిల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రామదాస్ సోరెన్ ఎన్నికయ్యారు. 2009, 2019లో ఆయన జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం జంషెడ్పూర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. తాజాగా మంత్రిగా ప్రమాణం చేసిన రామదాస్‌కు గవర్నర్, సీఎం, ఇతర మంత్రులు, పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
భూ కుంభకోణం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఏడాది జనవరిలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత చంపై సోరెన్ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ కేసులో జులై తొలి వారంలో హేమంత్ సోరెన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన రోజుల వ్యవధిలోనే హేమంత్ సోరెన్ మళ్లీ సీఎం పగ్గాలు అందుకున్నారు. ఆ తర్వాత తన కేబినెట్లోకి చంపై సోరెన్‌ను తీసుకున్నారు.
ఈ క్రమంలో సొంతపార్టీపై చంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జేఎంఎంకు రాజీనాయా చేసేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు. ఆ తర్వాత తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. 30వ తేదీన (ఈరోజే) కమలం పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని అన్నారు. గిరిజనుల సంక్షేమంతో పాటు జార్ఖండ్ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. బంగ్లాదేశ్ చొరబాట్లతో ప్రమాదంలో పడిన గిరిజనులకు బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు. తాను ఎంతో కష్టపడి ఈస్ధాయికి చేరుకున్నానని, జార్ఖండ్ అభివృద్ధితో పాటు గిరిజనుల ఉనికిని కాపాడేందుకే తాను కాషాయ పార్టీలో చేరుతున్నానని చంపై సోరెన్ వెల్లడించారు.
Also Read..
Jayasurya | లైంగిక వేధింపుల ఆరోపణలు.. నటుడు జయసూర్యపై రెండో కేసు నమోదు
Landslides | కొండచరియలు విరిగిపడి.. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి
Actor Darshan | సన్‌గ్లాసెస్‌తో బళ్లారి జైల్లోకి దర్శన్ ఎంట్రీ.. పోలీసులపై చర్యలు