హైదరాబాద్ : నిరుడు దేశవాళీల్లో సత్తాచాటి టీ20 ప్రపంచకప్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చి భారత్‌కు మూడో కప్పును అందించడంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్ కిషన్‌కు మరో బంపరాఫర్ దక్కిం ది. రాబోయే ఐపీఎల్ సీజన్లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వెన్నుగాయం కారణం గా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోని రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్.. కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్న తరుణంలో సన్‌రైజర్స్ తాత్కాలిక సారథిగా ఇషాన్‌ను నియమించింది.
అతడికి డిప్యూటీగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. కమిన్స్ ఎన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ అతడు ఈనెల 23న ఫ్రాంచైజీతో కలుస్తాడని జట్టు వర్గాల సమాచారం. ఇక్కడే అతడి పునరావాసం కొనసాగనున్నట్టు తెలుస్తున్నది. ఎస్ఆర్హెచ్ ఈనెల 28న బెంగళూరులో డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఐపీఎల్-19 ప్రారంభ మ్యాచ్‌తో టైటిల్ వేటను మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే.