ఒర్లీన్స్ (ఫ్రాన్స్) : బీడబ్ల్యూఎఫ్ ఒర్లీన్స్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీలో ఆయూష్ శెట్టి, తన్వి శర్మ ప్రిక్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో ఆయూశ్.. కిరణ్ జార్జిపై 17-21, 21-10, 21-17తో చిత్తుచేశాడు. కిడాంబి శ్రీకాంత్.. 12-21, 10-21తో మాగ్నస్ జొనాసెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు.
మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ 21-18, సుపనిద (థాయ్‌లాండ్)ను చిత్తుచేయగా మాళవిక 21-18, 21-14తో సుంగ్ షువొ-యున్ (తైవాన్)ను ఓడించి ప్రిక్వార్టర్స్ చేరుకుంది. అన్మోల్ 21-12, 21-16తో అరిన్ (టర్కీ)ను మట్టికరిపించింది.