Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ‘భారత్ జోడో యాత్ర’ (Bharat Jodo Yatra) పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో విడతలో ‘భారత్ న్యాయ యాత్ర’ ( Bharat Nyay Yatra) పేరుతో 14 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముగియనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకూ సుమారు 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. భారత్ న్యాయ యాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు. రాహుల్ ఈ యాత్రను బస్సు, కాలి నడకన కొనసాగించనున్నారు.
కాగా, రాహుల్ గతేడాది ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7, 2022న ప్రారంభమైన ఈ యాత్ర ఈ ఏడాది జనవరి 30న ముగిసింది. సుమారు 12 రాష్ట్రాల మీదుగా రాహుల్ పాదయాత్ర చేశారు. 145 రోజుల (దాదాపు 5 నెలలు) పాటు సాగిన ఈ సుదీర్ఘ యాత్ర దాదాపు 3970 కి.మీ మేర సాగింది.
Also Read..
Dense Fog | ఢిల్లీ గజగజ.. 110 విమాన రాకపోలకు అంతరాయం
Uttar Pradesh | ఆగ్రా – లక్నో ఎక్స్ప్రెస్ వేపై దట్టంగా పొగమంచు.. వాహనాలు ఢీకొని ఒకరు మృతి
Earthquake | మూడు రాష్ట్రాలను వణికించిన భూకంపాలు..